Posts

మనిషి, మరణం, చరిత్ర

  మనిషి, మరణం, చరిత్ర మనిషికి చావు, పుట్టుకల్లో చావు పెద్దది, గొప్పది, ఒక రహస్యం. సహజమైన చావు, పుట్టుకలు మనిషిని ఆలోచింపజేసినంత మరేవీ ప్రభావితం చేయలేదు. పురాతన కాలం నుంచి...           పాతరాతియుగంలో మనుషులు ఆహారసేకరణ కొరకు నిరంతరం సంచరిస్తూనేవుండేవారు. ఒక స్థిరనివాసమేదీ లేదు. కౄరమృగాలను వేటాడడమో, వాటి నోటికి ఆహారమైపోవడమో జరుగుతుండేది. చేతికి దొరికిన రాయి, రప్పా, కట్టె, పేడు, తీగె, ఊడలను ఆయుధాలుగా విసిరి, కొట్టి జంతువులను చంపి బువ్వ సంపాదించుకునేవారు. మెల్లగా రాతి కఠినత్వం తెలిసి, చేతిపనిముట్లుగా మలుచుకున్నారు. కొత్తరాతియుగంనాటికి మనుషుల ఆయుధసంపద పెరిగింది. ఆహార సేకరణకు వేట ప్రధానమైన సాధనమైంది. బతికినవాండ్లు బట్టకట్టనికాలంలో కొత్తతావులు వెతుక్కుంట పోయేవారు. చచ్చిన మనుషులను ఎక్కడికక్కడ వదిలేసేవారు. లేదా నీటిరేవుల్లో వదిలేసేవారు. అందువల్లనే కావచ్చు మనకు పాతరాతియుగంనాటి సమాధులు దొరకవు. మరణం గురించి మనుషుల నిర్వేదన గురించి కూడా వేదంలో ప్రస్తావనలున్నాయి. ‘నీ చూపులు సూర్యునిలో, నీ శ్వాస గాలిలో కలిసిపోనీ నీవు చేసినదాన్నిబట్టి (ధర్మం) భువికో, దివికో చేరుకో కోరుకుంటే నీటిలో కలిసిపో